Friday 13 April 2012

ప్రైవేటు బడులలో ఉచిత విద్య... ఎవడి సొమ్ము తో?

ప్రైవేటు బడులలో కూడా 25%  సీట్లని పేదవాళ్ళకి కేటాయించాలి అని సుప్రీం కోర్టు స్పష్టం చేసింది. బాలలు చదువుకోవటం వారి ప్రాధమిక హక్కు అని ఉచిత విద్యనూ ఇవ్వలేననటం వారి నుండి ప్రాధమిక హక్కు లని దూరం చేయటమే అని కోర్టు తన తీర్పు పేర్కోనది. 

అయితే కోర్టు చదువు అన్నది ఊరికే దొరికే వస్తువు కాదని చదువు చెప్పటానికి కర్చు అవుతుందని ఆ కర్చు ఎవరు
 బరిస్తారో చెప్పకపోవటం విచారకరం. ఇప్పుడు ఈ ఉచిత భారాన్ని ఎవరు బరిస్తారు, ప్రభుత్వమే భరిస్తుందని చెప్పినా, ప్రభుత్వం  దాని లెక్కల ప్రకారమే ఇస్తుంది అంటే ఒక విద్యార్ధికి ఒక ప్రైవేటు బడిలో సంవత్సరానికి ఆరు వేలు కర్చు అవ్తోంది అనుకొంటే ప్రభుత్వం లెక్కల ప్రకారం ఒక విద్యార్ధికి మహా అయితే ఏడాదికి మూడు వేలు వరుకు ఇస్తారు అంటే మిగిలిన మూడు వేలు ఆ స్కూలు ఫీజులు పెంచి వసూలు చెయ్యవలసిందే. పోనీ ప్రభుత్వం ఇచ్చే డబ్బు అయినా ఎక్కడ నుంచి వస్తోంది అది ప్రజల దగ్గర పన్నులు రూపంలో వసూలు చేసిందే అంటే ఎటు తిరిగి భారం ప్రజల పైనే.

ప్రస్తుతం ఎవరైతే వారి పిల్లలను ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివిస్తునారో వారు కూడా ఇప్పుడు కట్టకుండా ఉండేందుకు ప్రయత్నిస్తారు. ప్రైవేటు బడులూ నకిలీ హాజరు పట్టికలు చూపించి ప్రభుత్వం ఇచే సొమ్ము ని దోచుకొంటై దానికోసం అధికారులకి ముడుపులు ముట్ట చెబుతాయి చివరికి ఇది మరో కుంబకోణం అవుతుంది ప్రజల నెత్తి మీద సంవత్సరానికి మరో ఏబై వేల కోట్ల భారం.

పిల్లలను బడి కి పంపాలి అంటే నిర్బంధ విద్య చట్టం తో పరిష్కారం రాదు...ప్రజలకు చదువుకుంటే వుండే లాబాలు తెలియాలి ప్రభుత్వమే ఉపాధి హామీ అని పని వున్నా లేక పొఇనా కూలి ఇచ్చి రెండు రుపైల కే కిలో బియం ఇస్తే చదువుకొని సంపదిన్చావలిసిన అవసరం ప్రజలకు ఏమిటి. చదువు హక్కు అని తిండి హక్కు అని ఇల్లు హక్కు అని బట్ట హక్కు అని అన్ని ఉచితంగా ఇవ్వటానికి ప్రభుత్వానికి డబ్బులు ఏమి చెట్టుకు కాయటంలా ప్రజల వద్ద నుంచే పన్నులు అనే పేరుతో దోపిడీ చేస్తోంటే వస్తునై ఈ దోపిడిని ప్రజలందరూ ముక్త కాంతం తో వ్యతిరేకించాలి.

ప్రజలకి ఎజమన్యాలకి వున్నదార్లు ఏమిటి. ప్రతి స్కూలు stateboard మరియు central board ల నుంచి తమ  గుర్తింపును
స్వచందంగా విరమించుకోవాలి ప్రైవేటుగా తమ సిలబస్ తామే తాయారు చేసుకోవాలి (ఇది ఇంకా మంచి సిలబస్ తాయారు చేయటానికి ఎంతో ఉపయోగం) ఈ స్కూలలని సిలబస్ని ratings ఇవ్వటానికి (credit ratings ఇచ్చే ICRA, CRISIL, Moodys & S&P లాగా) ప్రైవేటు సంస్థలని ఏర్పాటు చేసుకోవాలి వీటి ratings ఆధారంగా పై చదువులకు వెళ్లవచ్చు. ఇంత చేసిన ప్రభుత్వం తనకు వున్న అధికారం తో చట్టాన్ని అమలు చెయ్య వచ్చు కాని ఈ చట్టం తప్పు అని ప్రతి ఒక్కరు గ్రహించాలి అంతవరకు ఈ ప్రభుత్వం అనే గూండా చేతిలో మనం హింసించ బడుతునే వుంటాం.

9 comments:

  1. ఈ దేశ ప్రజల చీప్ లేబర్ మీదే అధారపడి జరుగుతున్న అభివృధ్ధి ఫలాలు అందుకుంటున్న కొద్దిమంది ఆలోచించుకోవాలి ఎవడబ్బ సొమ్మని !!

    తమ సొమ్ముని ఓట్లకోసం పేద ప్రజలకి దోచిపెడుతున్నారనే అపోహల్లో ఉండే వాళ్ళు ఆలోచించుకోవాలి, ఎవడబ్బ కష్టంతో ప్రభుత్వ కాంట్రాక్టుల్లో కూడా సరైన వసతుల్లేని పరిస్థితుల్లో పనులు చెయించుకొని అభివృధ్ధిని అంతా తమ చూట్టూనే పెట్టుకొని కులికే వాళ్ళు ఆలోచించుకోవాలి..

    ఒకవైపు కనీస రోడ్డు లేని గ్రామాలూ, మంచినీటి వసతి కూడా లేని గ్రామాలు ఉండగా వేల కోట్ల కేటాయింపులు మిగిలిన రంగాలకి చేసుకుంటూ ఒక దేశంలోనే సంపన్నుల మీనీ దేశం ఏర్పాటు చేసుకున్నట్టు ప్రవర్తిస్తున్న వాళ్ళు ఆలోచించుకోవాలి ఎవడబ్బ సొమ్మని..

    ReplyDelete
  2. I welcome if you provide a different perspective and want to highlight the financial management side of these things.

    But, treating the common people as a herd rather than as respectable individuals is something I hate to see.

    I do not have anything against you. I admit that, the tone of your post made me angry. I am just rejecting the way this particular post viewed and treated the common people of this country..

    ReplyDelete
  3. I never considered common people to be herd....in fact its the government which is considering the common people to be herds and deciding on their behalf what to do and what not to do? why does government have to tell what people have to do with their children, does it think they have no intellegence to think.

    I am against government spending whether it is for poor or rich or middle class or for corporates....I am equally against governments providing bailouts and sops to the corporates.

    I strongly feel with out the government intervention there will be more children who will be getting good quality education than now.

    ReplyDelete
  4. Thank you for the clarification...

    >>"ప్రభుత్వమే ఉపాధి హామీ అని పని వున్నా లేక పొఇనా కూలి ఇచ్చి రెండు రుపైల కే కిలో బియం ఇస్తే చదువుకొని సంపదిన్చావలిసిన అవసరం ప్రజలకు ఏమిటి. చదువు హక్కు అని తిండి హక్కు అని ఇల్లు హక్కు అని బట్ట హక్కు అని అన్ని ఉచితంగా ఇవ్వటానికి ప్రభుత్వానికి డబ్బులు ఏమి చెట్టుకు కాయటంలా"

    These lines are an example..

    anyway, I beleive primary education and primary health shall have a strong Govt. presence. Howmuch of that presence is in the form of ownership and how much in the form of regulation is something that can be calibrated continuously based on the needs.

    ReplyDelete
  5. >>"deciding on their behalf what to do and what not to do? why does government have to tell what people have to do with their children"

    I am sorry to tell you that you did not tried to understand the Act and just jumped on to it with a lot of assumptions.

    Through this Act, Govt. is not making it mandatory for anyone, The Govt. is committing itself to action.
    --------------------
    Every child of this country who is between 6 and 14 years of age is legally entitled to receive free and compulsory elementary education (Class VIII). The Government is responsible and accountable for ensuring this.

    By the way, what is the meaning of Free and Compulsory education? The intent is not to compel anybody forcibly to go to school. It is compulsory for the government to provide opportunity, resources, facilities and infrastructure for all the future citizens.
    ------------------------------------------

    Govt. is committing itself for provision of this level playing field to the citizens.

    ReplyDelete
  6. btw, if you have sometime...

    http://weekendpolitician.blogspot.in/2010_04_01_archive.html

    ReplyDelete
  7. "I am sorry to tell you that you did not tried to understand the Act and just jumped on to it with a lot of assumptions.

    Through this Act, Govt. is not making it mandatory for anyone, The Govt. is committing itself to action."

    yes I thought its mandatory for everyone....its good if its not......have read regarding the bill...but I might have mislead...

    but still i opose this law because of the points mentioned in the post.....

    will go through the link you have provided

    ReplyDelete
  8. ప్రజలు విద్యావంతులైతే, వాళ్ళకు ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉంటాయి. కాబట్టి ప్రజలు చదువుకుంటే ప్రభుత్వాల పని సులువవుతుంది. చిన్నపిల్లల చదువుకోసం ప్రభుత్వాలు వ్యయంచేసే ఖర్చుని ఒక investmentగా భావించాలి. ఉచిత విద్యనందించడం సరైనదే. అది చెయ్యలేని ప్రభుత్వాలు కనీసం చిన్నపిల్లలచేతకూడా శ్రమచేయిస్తేనే ఇల్లుగడవని పరిస్థితి తల్లిదండ్రులకు రాకుండా చూడాలి. అది చేయనప్పుడు నిర్భంద విద్య వేధా.

    ప్రైవేటు విద్యను ప్రభుత్వాలు ఉచితంగ అందించటం నాకు అర్ధంకాదు. తను ఉచితంగా అందించే విద్యనే ప్రైవేటు విద్యాసంస్థలతో పోటీపడగల విధంగా మలవగలగడం మంచి long term plan అవుతుంది.

    Tha same applies for bail outs. కాకపోతే bail outs అనేవి సంస్థలకోసం కాకుండా ప్రజలు వీధినపడకుండా ఉండటంకోసమని చెయ్యాలి.

    ReplyDelete